నిజాంపేట్‌లో ఆద్య స్కంద డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌ను ప్రారంభించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: నిజాంపేట్ రోడ్డులోని‌ కేఎన్ఆర్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన “ఆద్య స్కంద డయాగ్నోస్టిక్ సెంట‌ర్‌ను నిజాంపేట్‌ మేయ‌ర్ నీలా గోపాల్‌రెడ్డి గారు, స‌న్‌షైన్ ఆస్ప‌త్రుల చైర్మ‌న్ డాక్ట‌ర్ గురువారెడ్డి, ప్ర‌ముఖ సినీ డైరెక్ట‌ర్ మారుతి, నిర్వాహ‌కులు వెంక‌ట సుధాక‌ర్‌రెడ్డిల‌తో క‌లిసి ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ మంగ‌ళ‌వారం లాంచ‌నంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ న‌గ‌రంలో ముఖ్యంగా కూక‌ట్‌ప‌ల్లి, కుత్భుల్లాపూర్, నిజాంపేట్‌, శేరిలింగంప‌ల్లి ప్రాంతాల‌ ప్ర‌జ‌ల‌కు ఆధునాతన సౌకర్యాలతో కూడిన డయాగ్నోస్టిక్ సెంటర్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ఈ క‌రోనా సంక్షోభంలో క‌రోనా తో పాటు ఏవైనా వ్యాధినిర్ధార‌ణ ప‌రీక్ష‌లు వేగంగా పూర్తి చేసేందుకు స్కంద డయాగ్నోస్టిక్ సెంట‌ర్ ముందుండాల‌ని పేర్కొన్నారు. డాక్ట‌ర్ గురువారెడ్డి, డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూకొన్నేళ్లుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో డాక్టర్ వెంక‌ట‌ సుధాక‌ర్‌రెడ్డి, డాక్ట‌ర్ రూపారెడ్డి లు ఎంతో గొప్ప డాక్ట‌ర్లుగా గుర్తింపు పొంది, రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవలు అందించిన‌ సుపరిచితుల‌ని, వారు డయాగ్నోస్టిక్ సెంట‌ర్ సేవలు ప్రారంభించడం శుభపరిణామమన్నారు.

డ‌య‌గ్నోస్టిక్ సెంట‌ర్‌ను ప్రారంభించి అధునాత‌న యంత్రాల‌ను పరిశీలిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, నిజాంపేట్ కార్పొరేష‌న్ మేయ‌ర్ నీలాగోపాల్ రెడ్డి త‌దిత‌రులు

ఏడాది పాటు ప్ర‌తీ టెస్ట్‌పై 20 శాతం రాయితీ…
డాక్ట‌ర్ వెంక‌ట‌‌సుధాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ క‌రోనా సంక్షోభంలో ప్ర‌తి ఒక్క పేషెంట్ టెస్టులు వేగంగా పూర్తి చేసేలా ల్యాబ్‌లో అన్ని ఆటోమేటెడ్ మెషన్స్ ఏర్పాటు చేశామ‌ని, ముఖ్యంగా మ‌‌‌ల్టీ స్లైస్‌ సీటీ స్కాన్‌, ఎక్స్‌రే ఇన్ 3 సెక‌న్స్- డిజిట‌ల్ రేడి యోగ్ర‌పీ, 4 డీ -అల్ట్రాసౌండ్‌, క‌ల‌ర్ డాప్ల‌ర్, పాలీ క్లినిక్‌ ఇత‌ర అన్నిఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీతో కూడిన మెష‌న్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. ఏడాది పాటు ప్ర‌తీ టెస్టుకు 20 శాతం రాయితీ క‌ల్పిస్తున్న‌ట్టు వారు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావు, నాయ‌కులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాశినాథ్ యాదవ్, పోతుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here