శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, కోదండరాం, ప్రభాకర్, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, గణేష్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ జాతిపిత మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గౌరవ PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అహింసా మార్గంలో నడిచి, సత్యాన్ని ఆయుధంగా మార్చి దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు తన హృదయపూర్వక నివాళులు తెలియచేస్తున్నాను అని అన్నారు. అహింస ఆయుధంగా, సత్యం, ధర్మం, సైన్యంగా స్వాతంత్ర పోరాటానికి దిక్సూచి మహాత్ముడు అని అన్నారు.