అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ కు రూ.50వేల‌ చెక్కు అందజేత

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూ జే ) శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు యు.రమేష్ సాగర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యు.శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమావేశాన్ని పీజేఆర్ స్టేడియంలో నిర్వ‌హించారు. ఇందులో జర్నలిస్టుల సమస్యలపై అడిగిన ప్రశ్నలకు స‌మాధానాలు చెప్పారు. ఇందులో ముఖ్యంగా సీనియర్ రిపోర్టర్ పండ్ర ప్రగడ లక్ష్మణ్ రావు కు సంబంధించి ఆయన అనారోగ్య సమస్య తో బాధపడుతున్నాడని తెలిసి తక్షణం రూ.50వేల చెక్కు అందించారు. రిపోర్టర్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించి పరిష్కారం చూపేది టీయూడబ్ల్యూజే యూనియన్ మాత్రమే అని అన్నారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు యు.రమేష్ సాగర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు యు.శేఖర్ సాగర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ల‌క్ష్మ‌ణ్ రావుకు చెక్కును అంద‌జేస్తున్న శేఖ‌ర్ సాగ‌ర్‌, ర‌మేష్ సాగ‌ర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here