నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు సేవాభావంతో నాణ్యమైన వైద్య సేవలు అందించి వైద్య వృత్తి ప్రతిష్టను ఇనుమడింపజేయాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సూచించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ ఏయ్ హాస్పిటల్ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలు అందించడానికి హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. నాణ్యమైన వైద్య చికిత్సలు అందించేందుకు సేవ దృక్పథంతో ముందుకు రావడం చాలా అభినందనీయం అన్నారు. ప్రజలకు డాక్టర్లు దేవుడి తో సమానం అని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని సామాజిక సేవ రూపంలో సరసమైన ధరలతో మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మదీనాగూడ రామ్స్ ఏయ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీతారాం, మదీనాగూడ విజయ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అల్లం పాండు రంగారావు, కేశవ్ నేత్రాలయ ఏయ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేష్, డాక్టర్ ఫణి, సర్జన్ డాక్టర్ శివ, డాక్టర్ సంకీర్త్ రెటీనా, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు ప్రకాష్, రంగస్వామి ముదిరాజ్ స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.