నమస్తే శేరిలింగంపల్లి: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల ద్వారా వస్తున్న మురికి నీటి సమస్యను పరిష్కరించాలని ఎన్ బీ ఆర్ ఎన్ క్లేవ్, చందానగర్ డివిజన్ భవానిపురం కాలనీ వాసులు ప్రజాప్రతినిధులను,అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో చందానగర్ డివిజన్ లోని భవాని పురం కాలనీ వాసులు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ని కలిసి సమస్యను వివరించారు. అమీన్ పూర్ ప్రాంతంలోని డ్రైనేజీ భవానిపురంలోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇదే సమస్యపై అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్ బీ ఆర్ కాలనీ వాసులు మున్సిపల్ చైర్మన్ సుజాతను కలిసి వినతి పత్రం అందజేశారు. రెండుమూడు రోజుల్లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించేలా పనులు చేపడుతామని హామీ ఇచ్చినట్లు ఆయా కాలనీ వాసులు తెలిపారు.