నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన సంక్షేమ, సంరక్షణ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా చేపడుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళాబంధు కేసీఆర్ మూడు రోజుల కార్యక్రమాల ముగింపు కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సంధ్య కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. జోనల్ కమిషనర్ ప్రియాంక అల, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, టిమ్స్ డైరెక్టర్ విమల థామస్, డీసీలు వెంకన్న, సుధాంష్, గచ్చిబౌలి సీఐ సురేష్, ప్రముఖ హీరోయిన్ ఈప్సిత పాటి, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో ఎమ్మెల్యే గాంధీ ఆయా రంగాలకు చెందిన మహిళలను ఘనంగా సన్మానించారు. స్వయం సహాయక సంఘాలకు రూ. 30 కోట్ల రూపాయల చెక్కులను, రూ. 12 లక్షల విలువ గల కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను మహిళాబంధు కేసీఆర్ పేరిట మూడు రోజుల పాటు ఘనంగా సంబరాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వంశీ మోహన్, ఆర్ ఐ శ్రీకాంత్, ప్రాజెక్ట్ ఆఫీసర్లు వత్సలదేవి, మన్వి, ఏఎంఓహెచ్లు రవి కుమార్, కార్తిక్, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, ఆయా డివిజన్ల అధ్యక్షులు రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, కృష్ణ గౌడ్, కిరణ్ యాదవ్, నాయకులు పద్మారావు, చాంద్ పాషా, చింతకింది రవి, జంగం గౌడ్, పద్మారావు, వేణు గోపాల్, తిరుపతి యాదవ్, పవన్, తదితరులు పాల్గొన్నారు.