ప్రజా సమస్యలను పరిష్కరించండి – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: మరమ్మత్తుల పేరుతో రోడ్లను తవ్వి గుంతలమయం చేశారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. మదీనగూడ రామకృష్ణ నగర్ లో కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు బిజెపి నాయకులతో కలసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మరమ్మతుల పేరిట రోడ్లు మొత్తం గుంతల మాయనికి గురిచేశారని, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతరం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికారులు స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, నాయకులు మనోహర్, రవి గౌడ్, వర ప్రసాద్, కోటేశ్వరరావు, రవి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మదీనగూడ రామకృష్ణ నగర్ లో పర్యటించిన జ్ఞానేంద్ర ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here