నమస్తే శేరిలింగంపల్లి: మహాశివరాత్రి పండగ పురస్కరించుకొని మాదాపూర్ లోని శిల్పారామంలో అభినయ వాణి నృత్య నికేతన్ గురువు బాల త్రిపురసుందరి శిష్య బృందం చే “శివ నటనం” కూచిపూడి నృత్యప్రదర్శన ఆధ్యంతం అలరించింది. కౌత్వం, సాంబశివాయనవే, నటేశ కౌత్వం, శివ స్తుతి, శివాష్టకం, వన్డే మహేశ్వరం, పరస్ తిల్లాన అంశాలను ప్రియా హాసిని, సంజన, వెన్నెల, శర్మిష్ఠ, శ్రీరామ్, అభిరాం, శ్రీ సౌమ్య, సంయుక్త, సహన, భువన, తదితరులు ప్రదర్శించారు. వీరికి గాత్రం డీవీకే శాస్త్రి, నట్టువాంగం బాల త్రిపురసుందరి, మృదంగం, రాజగోపాలాచారి, వీణ రాయప్రోలు సుధాకర్, వేణువు మురళి, వయోలిన్ దినకర్ సహకరించారు.