ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు : పలు సామాజిక సేవల్లో టీఆర్ఎస్ శ్రేణులు

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బంగారు తెలంగాణ మార్గ నిర్దేశకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా మూడు రోజుల పాటు జరుపుకోవడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ ఎమ్మెల్యే క్యాంపు‌ కార్యాలయంలో సర్వ మత ప్రార్ధనలు చేశారు. తమ ప్రియతమ నేత‌ కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.60 ఏళ్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను 14 ఏళ్ళల్లో నెరవేర్చిన ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్దివైపు నడిపిస్తున్న బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ 68 వ జన్మదినం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు సామాజిక సేవ‌ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అన్ని మతాల పెద్దలతో సర్వమత ప్రార్థనలు జరిపించి కేసీఆర్ జన్మదిన కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయి బాబా, రంగారావు తో పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మియాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు చేయిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, 

హఫీజ్ పేట్ డివిజన్ లో…
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్దిల్లాల‌ని ప్రభుత్వ విప్,‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హాఫీజ్ పెట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ తో కలిసి మొక్కలను నాటారు. అనంతరం గంగారాం గ్రామంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్ జన్మదినం‌ సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో మొక్కలు నాటుతున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్ డివిజన్ లో…
మాదాపూర్ డివిజన్ పరిధిలో ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఘనంగా నిర్వహించారు.‌ పాఠశాలలోని చిన్నారుల మధ్య కేసీఆర్ జన్మదిన కేకును కట్ చేశారు. ఇజ్జత్ నగర్ వీకర్ సెక్షన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన సంబురాలు జరుపుకున్నారు.

చిన్నారుల‌ మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

చందానగర్ డివిజన్ లో…
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి మంత్రి కేసిఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చందానగర్ సురక్ష ఎన్ క్లేవ్ లోని అమ్మ నాన్న అనాధ ఆశ్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు వరలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపించారు. ప్రభుత్వ విప్ గాంధీ, చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొని వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు గుడ్ల ధనలక్ష్మి పబ్బా మల్లేష్, పులిపాటి నాగరాజు, రవీందర్ రెడ్డి, అక్బర్ ఖాన్, దాసు, కొండల్ రెడ్డి, యశ్వంత్, అమిత్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

వృద్ధులకు అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ ‌కార్పొరేటర్ మంజుల రెడ్డి

కొండాపూర్ డివిజన్ లో
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రదాత ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ జన్మదిన సంబరాలు కొండాపూర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజ రాజేశ్వరి కాలనీ హై టెన్షన్ 100 ఫీట్ రోడ్డులో ఉన్న జీహెచ్ఎంసి పురాతన బావి దగ్గర ఉన్న పార్కులో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలసి కార్పొరేటర్ హమీద్ పటేల్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణగౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, షేక్ చాంద్ పాషా, జంగంగౌడ్, రూపారెడ్డి, తిరుపతి యాదవ్, రవి శంకర్ నాయక్, సాయి శామ్యూల్ కుమార్, గోల్డెన్ తులిప్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్వీయన్ రాజు, వెంకట్ రెడ్డి, న్యూ పీజేఆర్ నగర్ ప్రెసిడెంట్ వెంకటి, రాజా రాజేశ్వరి కాలనీ వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, నీలం కుమార్, మొహ్మద్ ఖాసీం, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, డాక్టర్ రమేష్, గిరి గౌడ్, యాదగిరి, వెంకటరెడ్డి, మంగమ్మ, శ్యామల, దీపక్, వసీమ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటుతున్న కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

మియాపూర్ డివిజన్ లో
మియాపూర్ డివిజన్ పరిధిలోని డీకే ఎన్ క్లేవ్ కాలనీ అసోసియేషన్ భవనం లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు‌ ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు ముప్పవరపు గంగాధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన‌ కేసీఆర్ జన్మదిన వేడుకల్లో‌ స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు ‌ గంగాధర్ రావు ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లకు బిర్యానీ ప్యాకెట్లు, దుప్పట్లను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపారాజు శ్రీనివాస్, జహంగీర్, కె రోజా, చంద్రిక ప్రసాద్ గౌడ్, సుప్రజా, మోహిన్, మల్లేష్,
హన్మంత్ రావు, శివ, విజయ్, రాంబాబు, అనిల్ రాయ్, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

శానిటేషన్ సిబ్బందికి బిర్యానీ ప్యాకెట్లు, దుప్పట్లను పంపిణీ చేస్తున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here