నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. తాండవ కృష్ణ నృత్యాలయ గురువు ఉదయశ్రీ తన శిష్య బృందంచే ప్రదర్శించిన కూచిపూడి నృత్యప్రదర్శన అందరిని అలరించింది. తాండవ నృత్యకరీ, వచ్చెను అలివేలు మంగ, దశావతారాలు, వాడేలే వయ్యారాలు, నమశ్శివాయతేయ్, శివ తాండవ స్తోత్రం, భో శంభో, అష్టలక్ష్మి స్తోత్రం, అయిగిరి నందిని, తిల్లాన తదితర అంశాలను ఉదయశ్రీ, దుర్గ హాసిని, లాస్య ప్రియ, సంహిత, అర్పిత, దీక్షిత, అక్షయ శ్రీ, ఉపాసన, గీతికా ప్రదర్శించారు.