ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: దేవాలయాలను సందర్శించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత అలవడుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధి లోని నానక్ రామ్ గూడలో గల శ్రీ అభయాంజనేయ స్వామీ దేవాలయం 15వ వార్షికోత్సవం లో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయాలు మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు యాదయ్య, ప్రకాష్, ప్రసాద్, నర్సింగ్ రావు, ఆలయ పాలకవర్గం జక్కుల యాదవ రావు, జక్కుల నర్సింగ్ రావు, జక్కుల రమేష్, జక్కుల సహదేవ్, అర్చకులు మరింకంటి రఘునాథ్ చార్యులు, కాలనీ వాసులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.

అభయాంజనేయ స్వామి వారిని‌ దర్శించుకున్న గచ్చిబౌలి ‌కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here