ఆత్మస్థైర్యం తో ముందుకు‌ సాగిన యోధుడు సుభాష్ చంద్రబోస్ – ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మార్గంలో ప్రయాణించి, మానవ సేవే మాధవ సేవా అనే నినాదంతో, రామకృష్ణ పరమహంస ఉపదేశించిన దేశభిమానం, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిన యోధుడు సుభాష్ చంద్రబోస్ అని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పరాక్రమ దివస్ సందర్భంగా బీహెచ్ఈఎల్ ఎంఐజీ కాలనీలోని యస్ ఓయస్ అనాథ శరణాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ నేతాజీ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. విద్యార్థిని, విద్యార్థులకు పండ్లు, బిస్కెట్స్, మాస్కులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కథక్ పట్టణంలో జన్మించారని, వారి తండ్రి జానకి నాథ్ బోస్ న్యాయవాది, గొప్ప జాతీయతావాది అన్నారు. సుభాష్ చంద్రబోస్ ప్రతిభవంతుడైనా విద్యార్థి అని కేమ్ బ్రిడ్జ్ విశ్వావిద్యాలయంలో సివిల్ సర్వీసెస్ పూర్తి చేసుకొని, బ్రిటిష్ నిరంకుశ విధానాలు నచ్చక, వారితో విబేధించి, సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, స్వదేశానికి తిరిగి వచ్చి, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. గాంధీ సూచనలు, సలహాల మేరకు కలకత్తాలో దేశబంధు చిత్రరంజన్ దాస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర పోరాటంలో వారితో కలసి పని చేశారని, బెంగాల్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నెహ్రుతో కలసి పనిచేశారని వివరించారు. మహాత్మా గాంధీ అహింస ద్వారానే స్వాతంత్ర సముపార్జన చేయాలనే అభిప్రాయంతో పనిచేసే వారని, సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టవచ్చునని భావించి, ఆ దిశగా పయనించాడన్నారు. సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వల్ల, కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారన్నారు. బోస్ ఉపన్యాసంలో మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి‌ నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తానని నినదించే వారని గుర్తు చేశారు. చరిత్రలో దేశంకోసం ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పోరాడిన వారిలో సుభాష్ చంద్రబోస్ ఒకరని గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆంగ్లేయులపై రాజీ లేని పోరాటం సాగించారన్నారు. నేటి యువత దేశం కోసం నిస్వార్థంగా పని చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, దేశ సమైక్యత, సమగ్రతలకు, దేశభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, సంధ్య, వికాస్, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.

అనాథ శరణాలయంలో సుభాష్ చంద్రబోస్ ‌జయంతి నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here