సుభాష్ చంద్రబోస్ ను దేశం ఎన్నటికీ మరవదు – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: భరతమాతను ధాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందడానికి పోరాడిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. మియాపూర్ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ లో డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావు అధ్యక్షతన భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ నాయకులు, కాలనీ వాసులతో కలసి చంద్రబోస్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు జననం తప్ప మరణం లేదన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, స్వంత సైన్యాన్ని ఆవిష్కరించిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అన్నారు. దూకుడే ఆయన మంత్రం, రాజీలేని పోరాటమే ఆయన తంత్రం, నిప్పులు చెరుగుతూ ముందుకు ఉరకడమే ఆయన వ్యూహం అని అన్నారు. మన దేశానికి సైనికులు ఉన్నారంటే దానికి కారణం చంద్రబోస్ అన్నారు. యువతను ఉత్తేజ పరిచి దేశ సైనికులుగా మార్చడం ధ్యేయంగా చేసుకొని స్వాతంత్ర్య సాధనలో తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డి ఎస్ ఆర్ కె ప్రసాద్, నాగేశ్వర్ గౌడ్, శ్రీశైలం కురుమ, లక్ష్మణ్, రవీందర్, ప్రభాకర్, గణేష్, వెంకట్, శ్రీను, బాల స్వామి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here