నమస్తే శేరిలింగంపల్లి: ఉద్యోగ సంఘాల మద్దతుతో జనజాగరణ దీక్ష చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడం పట్ల బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నం 317 సవరణ కోసం ఉద్యోగుల బదిలీల విషయంలో అన్ని ఉద్యోగుల సంఘాల మద్దతుతో జనజాగరణ దీక్ష చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం కేసిఆర్ ప్రభుత్వం రాక్షస పాలనను తలపిస్తోందన్నారు. న్యాయం కోసం దీక్ష చేపడితే కోవిడ్ రూల్స్ గుర్తుకొస్తున్నాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసే అవినీతి దొంగ పాలనను బిజెపి బయట పెడుతుందనే భయంతో దీక్షలను అడ్డుకుంటున్నారని అన్నారు. అరెస్టులకు, కేసులకు బిజెపి భయపడదని అన్నారు. ప్రతి బిజెపి కార్యకర్త ఒక సైనికుడిలాగా నిలబడి టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెపుతాం అని అన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామ్య విధానాలను ప్రశ్నించే గొంతుకల్ని నొక్కడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి రివాజుగా మారిందన్నారు.