నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీలో ఎస్టీపీ ప్లాంట్ లో ఏర్పడిన సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి ఆదేశించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ యూజీడీ పైప్ లైన్ లలోకి ఎస్టీపీ మురుగు నీరు వచ్చి కాలనీలోని భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ లోకి కలుస్తుడంటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు క్షేత్ర స్థాయిలో ఎస్టీపీని పరిశీలించి వెంటనే సమస్యను పరిష్కరించేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, డీఈ స్రవంతి, ఏఈ రమేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్, జగన్, డీజీఎం వసంత, కాలనీ వాసులు శ్రీనివాస్ రెడ్డి , నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.