సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించొచ్చు : డైమండ్ హైట్స్ లో సీసీ కెమెరాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: సీసీ కెమెరాలను ప్రతి కాలనీలో, ప్రతి ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలతో నేరాలు, దొంగతనాలను నియంత్రించవచ్చని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని డైమండ్ హైట్స్ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.3 లక్షల అంచనావ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, ఎస్ఐ అహ్మద్ పాషా, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు డైమండ్ హైట్స్ కాలనీ వాసులు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను మరింత‌ కట్టడి చేయవచ్చన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, అన్ని కాలనీ వాసులు ముందుకు వచ్చి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషి గా ఎమ్మెల్యే ఫండ్ (సీడీపీ) ద్వారా కోటి రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. డైమండ్ హైట్స్ కాలనీ, గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి తన వంతు సహాయం ఉంటుందని, కాలనీ లలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, నాయకులు చెన్నం రాజు, సత్యనారాయణ, సురేందర్, వినోద్, రమేష్ మల్లేష్, యాదగిరి, డైమండ్ హైట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామరావు, వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ రెడ్డి, ట్రెజరర్ వంశీ, కృష్ణ రావు, రాధ కృష్ణా, వెంకటేష్, మహేందర్, లక్ష్మణ్ రావు, సోమయాజులు, స్వరూపిణి, రమాదేవి, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here