బర్లంకుంట చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి బర్లం కుంట చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులను బుధవారం స్థానిక కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ చెరువుల సుందరీకరణకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బర్లంకుంట చెరువు చుట్టూ నిర్మించిన వాకర్స్ పాత్, ఎల్ఈడీ లైట్లు, చెరువు రక్షణ కోసం ఏర్పాటు చేయనున్న ఫెన్సింగ్ తదితర పనులను పరిశీలించిన కార్పొరేటర్ సంబంధిత కాంట్రాక్టర్ కు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సాయి సురేందర్, శర్మ, పద్మారావు,సుమన్, జాని, గోపాల్ యాదవ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

బర్లంకుంట చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన‌ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here