నమస్తే శేరిలింగంపల్లి: నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ విభాగం అధికార ప్రతినిధిగా కుడుపూడి శ్రీనివాసరావు నియామకమయ్యారు. నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ న్యూఢిల్లీ జాతీయ అధ్యక్షులు నెల్లి గురుదేవ్ ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పేదలకు ఆహారం బట్టలు, నిత్యవసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, విశిష్ట సేవలను గుర్తించి శ్రీనివాస రావుకు దక్షిణభారత ఉత్తమ ఆస్ట్రాలజర్ అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కడలి సత్యనారాయణ, ప్రపుల్ కుమార్, గుబ్బల పెద్దిరాజు, వీరస్వామి, శ్రీనివాస్ గౌడ్ (లడ్డు), విద్యా రాణి, లక్ష్మీ, జీనత్ బేగం, మాధవి పాల్గొన్నారు.