నమస్తే శేరిలింగంపల్లి: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఎస్ కె వీ బీ ఆర్ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ నిర్వహించిన రన్ ఫర్ పీస్ 2కె, 5కె, 10కె కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖా మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మహాత్ముని అడుగుజాడల్లో నేటి యువత పయనించాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, తెలంగాణ స్టేట్ ఫారెస్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఔషద మొక్కలను నాటారు. అనంతరం జెండా ఊపి రన్ ఫర్ ఫీస్ ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనియం అన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా చెట్లను పెంచి హరిత తెలంగాణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బొటానికల్ గార్డెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు భరత్ రెడ్డి, బాలకృష్ణ , నాగరాజు అసోసియేషన్ సభ్యులు, మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు చాంద్ పాషా, జంగం గౌడ్ , రమేష్ పటేల్, బలరాం యాదవ్, తిరుపతి రెడ్డి, పవన్, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.