నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు హర్ష టయోటా పక్కన గల 4 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జీ గజ్జల యోగానంద్ తహసీల్దార్ ను కోరారు. ఈ మేరకు హైదర్ నగర్ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో తహశీల్దారు గోవర్ధన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ గతంలో పలుమార్లు స్థలం కబ్జా అవుతుందని, కాపాడాలని తహశీల్దార్ కు విన్నవించినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. ఇదివరకు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగారు. తహశీల్దారు గోవర్థన్ స్పందిస్తూ రెండు రోజుల్లో ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా ప్రకటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వినతి పత్రం అందజేసిన వారిలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ వెలగ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ జానకి రామ రాజు, సీనియర్ నాయకులు నక్క శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, వేణు యాదవ్, బాగాని శ్రీనివాస్, కోటేశ్వర రావు, శ్రీ హరి, కరుణాకర్, బాషా, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.