నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా చూడాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సూచించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో టీఆర్ఎస్ బస్తీ, యూత్ కమిటీ లను ఎంపిక చేశారు. టీఆర్ఎస్ పార్టీ పటిష్టానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తి గా మారిందన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాల అండగా ఉంటామన్నారు. విపక్షాలు చేసే అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ సమర్థవంతంగా పని చేయాలని పేర్కొన్నారు. గోకుల్ ప్లాట్స్ బస్తి కమిటీలను టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఎంపిక చేశారు. బస్తీ కమిటీ అధ్యక్షునిగా జి.శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం, గౌరవ అధ్యక్షునిగా దుర్గ రావు, గోకుల్ ప్లాట్స్ యూత్ కమిటీ అధ్యక్షునిగా రాజు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, గౌరవ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వర రావు, సాంబశివ రావు, ప్రభాకర్, సాంబయ్య, మల్లా రెడ్డి, జీ.వి.రెడ్డి, బి.శ్రీనివాస్, రాజేష్, ప్రకాష్ రెడ్డి, దుర్గా రావు, చంటి, సత్యం, శ్రీనివాస్, రామ్మోహన్ రావు, పి.శ్రీనివాస్, వార్డ్ సభ్యులు శ్రీనివాస్, పితాని లక్ష్మి, యూత్ నాయకులు రాజేందర్, రుబిన్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.