నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 20 వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ని కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాలు తమతమ డివిజన్ల పరిధిలోని ప్రధాన కూడళ్లల్లో ఈ నెల 20 న ఉదయం 11 గంటలకు నల్ల బ్యాడ్జీలు – నల్ల షర్ట్ లు ధరించి ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ తీసి నల్ల జెండా ఎగురవేసి నిరసన తెలపాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం, చావు డప్పు కొట్టడం లాంటి కార్యక్రమాలు చేపట్టి నిరసనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సూచించారు. తెలంగాణ రాష్ట్రం పట్ల బిజేపి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా, తెలంగాణ యాసంగి వడ్లు ఒక్క కిలో కూడా తీసుకోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
