నమస్తే శేరిలింగంపల్లి: కొత్త కొత్త ఆలోచనలతో యువత ముందంజలో పయనిస్తుందని, స్వయం ఉపాధితో తమతో పాటు మరికొంత మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చినవారవుతారని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజ రాజేశ్వరీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ జోన్ మెన్స్ సెలూన్ షాపును కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభించారు. ఫ్యాషన్ జోన్ మెన్స్ సెలూన్ షాపు నిర్వాహకులు ఎమ్. రామకృష్ణ, నరేష్ కు కార్పొరేటర్ హమీద్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్ ముదిరాజ్, రాజ రాజేశ్వరి కాలనీ వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, లీలం కృష్ణ, అజయ్ సింగ్, సతీందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.