నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లోని రాఘవేంద్ర పాంచజన్య అపార్ట్‌మెంట్ లో నూతనంగా నిర్మించిన విజయ గణపతి దేవాలయంలో సోమవారం గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆలయాలను సందర్శించడం ద్వారా మానసిక ప్రశాంతత అలవడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఅర్ఎస్ నాయకులు దాసరి గోపి కృష్ణ, రాఘవేంద్ర పాంచజన్య అపార్ట్మెంట్స్ వాసులు ఠాగూర్ నాథ్ రెడ్డి, విజయ సారథి, రాజశేఖర్, విజయ్ కుమార్, రాకేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.