ఎస్సీ బస్తీలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కృషి చేస్తా – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ ఎస్సీ బస్తీ లో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఎస్సీ బస్తీలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఎమ్మెల్యే నిధుల మంజూరు కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు పంపిన మంజూరు పత్రాల‌ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కాలనీ వాసులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ సమగ్ర, సంతులిత అభివృద్ధి లో భాగంగా నానక్ రాంగూడ ఎస్సీ బస్తీ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే సీడీపీ నిధులు రూ. 5 లక్షలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిధులు మంజూరు కాగానే మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలని సూచించారు. కాలనీలో నెలకొన్న అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్, నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా కాలనీ వాసులు ఎమ్మెల్యే గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు కాశీనాథ్ యాదవ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here