నమస్తే శేరిలింగంపల్లి: పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కష్టాల తీరుస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, కూకట్‌పల్లి (పార్ట్) డివిజన్ల కు చెందిన అర్హులైన 14 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.14 లక్షల చెక్కులను ఎమ్మెల్యే గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందన్నారు. పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ యాదగిరి, మాజీ కార్పొరేటర్ రంగారావు, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, నాయకులు కాశీనాథ్ యాదవ్, యాదగిరి గౌడ్, వెంకటేష్ గౌడ్, దాత్రి గౌడ్, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.