నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా గాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తనదైన శైలిలో అద్భుతమైన పాటలు పాడి జనాలను చైతన్యపరిచిన విప్లవకారుడు గద్దర్ అకాల మరణం జీర్ణించుకోలేదని మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్, రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. మసీదు బండ, కొండాపూర్ పార్టీ కార్యాలయంలో గద్దర్ చిత్రపటానికి ఏర్పాటు చేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి అట్టడుగు వర్గాలను చైతన్య పరుస్తూ తుపాకీ తూటాలను సైతం లెక్కచేయకుండా విప్లవ భావాలను రేకెత్తిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని, పాటల ద్వారా మాటల ద్వారా ఎంతోమంది అభాగ్యులకు దారి చూపారని తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, రమేష్, హనుమంత్ నాయక్, ఆకుల నరసయ్య, శ్రీనివాస్ యాదవ్,మధు యాదవ్, బాలాజీ, కృష్ణ, సాగర్, రాజేష్, బాలరాజ్, సచిన్ ,లింగ స్వామి మొదలగు వారు పాల్గొన్నారు.