గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీ అభ్యర్థి అర్కల భరత్ కుమార్ సతీమణి పూర్ణిమ భరత్ కుమార్ డివిజన్ పరిధిలోని నల్లగండ్ల, గుల్మొహర్ పార్క్ కాలనీలలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని కోరారు.
ఈ సందర్భంగా పూరిమాభరత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే శేరిలింగంపల్లి నియోజక వర్గ అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి స్వార్ధ రాజకీయాలకు తెరలేపాయని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కలిపించడం లో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. డివిజన్ ప్రజలంతా హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.