బిజెపి ఎమ్మెల్సీ లను మరోసారి చట్టసభలకు పంపాలి: దేవర కరుణాకర్

నమస్తే శేరిలింగంపల్లి: త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి మరోసారి చట్ట సభలకు పంపే విధంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని శేరిలింగంపల్లి ఎన్నికల ఇంచార్జ్ దేవర కరుణాకర్ కురుమ అన్నారు. బుధవారం తార నగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని చందానగర్, శేరిలింగంపల్లి డివిజన్ ల బిజెపి అధ్యక్షులు రాంరెడ్డి, రాజు శెట్టిల అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవర కరుణాకర్ కురుమతో పాటు బిజెపి నాయకులు గజ్జల యోగనంద్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణ, విధివిధానాలపై బూత్ కమిటీ ల ఏర్పాటు తదితర విషయాలపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ మునిసిపల్ మరియు అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని ఈ విషయాన్ని ప్రతి ఒక్క బూత్ అధ్యక్ష్యులు, కార్యకర్తలు ఓటర్లకు అర్దం అయ్యే విధంగా వివరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఉత్సాహంగా పని చేసి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ లను మరో సారి చట్ట సభలకు పంపే బాధ్యత మన అందరి పైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా నాయకులు రమేష్ సోమిశెట్టి, మారం వెంకట్, రాఘవేంద్రరావు, ఎల్లేశ్, కసిరెడ్డి సింధు రెడ్డి, కాంచన కృష్ణ, శివకుమార్, వేణు, చిట్టా రెడ్డి ప్రసాద్, సత్యకురుమ, ప్రశాంత్ చారి, నారాయణరెడ్డి, చంద్రమౌళి, చంద్రమోహన్ లతో పాటు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .

సమావేశంలో మాట్లాడుతున్న శేరిలింగంపల్లి ఎన్నికల ఇంచార్జ్ దేవర కరుణాకర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here