ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మికచింతన వెల్లివిరియాలి – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక చింతన అవసరం అని, మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలను సందర్శించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ లో శ్రీ శ్రీ శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామి శోభయాత్ర లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి పల్లకీని మోసి తన భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ, దేవస్థానం ఛైర్మెన్ కృష్ణ మోహన్, సెక్రటరీ రాధ, టీఎన్జీవోస్ కాలనీ వాసులు నారాయణ రావు, కారం రవీందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, విశ్వనాథ్, సంజీవ రావు, కృష్ణ రెడ్డి, సాయి రెడ్డి , మామిడాల సాంబశివరావు, సత్యనారాయణ రెడ్డి, సుధాకర్ ,జంగయ్య కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

స్వామి వారి శోభాయాత్రలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here