నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో నిర్వహించిన వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. తిల్లాన ఆర్ట్స్ అకాడమీ గురువు మాధవి మారేళ్ళపూడి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. మల్లారి నాట రాగం, గణేశా పంచరత్న కీర్తన, జతిస్వరం, నటేశ కౌతం, పడవర్ణం, ఆడెనమ్మా, శంకర శ్రీగిరి మఱియు తిల్లాన అంశాలను కళాకారులు అస్మి, చేతన, హరిప్రియ, లలిత, న్యాస, సన్నిధి, స్ఫూర్తి, శ్రేయ, స్వేచ్ఛ లు ప్రదర్శించి మెప్పించారు.