నమస్తే శేరిలింగంపల్లి: ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరిలో అలవడాలని, అయ్యప్ప స్వామిని కొలిచిన వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. 41వ రోజుల అయ్యప్ప మాల ధరించి కాలి నడకన శబరిమల అయ్యప్పస్వామి దివ్యక్షేత్రం దర్శించుకొని తిరిగివచ్చిన స్వాములను నల్లగండ్ల శివాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర గౌడ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శబరిమల వరకు పాదయాత్రగా వెళ్లి క్షేమంగా తిరిగి రావడం సంతోషకరమని అన్నారు. అయ్యప్ప స్వామి దివ్యాశీస్సులతో పాదయాత్ర దిగ్విజయం అవడం పట్ల అయ్యప్ప స్వాములను అభినందించారు. ఈ కార్యక్రమంలో శివాలయం కమిటీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కొండల్ రెడ్డి, చంద్రశేఖర్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.