నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులు ఏకమవతున్నారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ లో నివాసం ఉండే రాజేందర్ ను కలిశారు. నాటి ఉద్యమకాలం జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించాక నేడు ఉద్యమకారులకు కనీస మర్యాద కరువైందన్నారు. అభివృద్ధి పనుల సమయాల్లో కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. రాజేందర్ ను కలిసిన వారిలో గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, మిద్దెల మల్లారెడ్డి, ఉమేష్ నర్సింలు పాల్గొన్నారు.