నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు కొలువైన బతుకమ్మ, దసరా పండగ సంబరాలు బుధవారం చందానగర్ డివిజన్ పరిధిలోని అంకుర్ ట్రీ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు సంస్కృతి సాంప్రదాయాల్లో వస్త్రలాంకరణ చేసుకుని బతుకమ్మ ఆడడం, దుర్గా మాతకు ప్రత్యేక పూజలు చేయడం తో పాటు రాముని, సీతా వేషాధారణలో రావణ దిష్టి బొమ్మ దహనం లాంటి కార్యక్రమాలను చేశారు. బతుకమ్మ, దసరా, దుర్గా మాత పూజలు, రావణ దహనం చిన్నారులు కళ్లకు కట్టినట్లు చేసి చూపించారు. అనంతరం దాండియా, బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు.