నమస్తే శేరిలింగంపల్లి: మతిస్థిమితం లేని ఓ మహిళ అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కె.లక్ష్మీ (50) ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్న తన అక్క ఇంటికి ఈ నెల 27న తెల్లవారుజామున వచ్చింది. కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో ఉండగా లక్ష్మీ ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మతి స్థిమితం సరిగా లేని లక్ష్మీ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. లక్ష్మీ కుమారుడు కె. మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఆచూకీ తెలిసిన వారు చందానగర్ పిఎస్ కు, 100 కు, 040 – 27853911, 9490617118, 7901110877 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని పోలీసులు తెలిపారు.