శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ జన్మదిన వేడుకల్లో జై బీసీ తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ మాట్లాడుతూ కొండా విజయ్ కుమార్ తన హోప్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదలకు సేవలు అందిస్తున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తరచూ రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతినిత్యం నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాయుడు, ఎన్ఎన్ రెడ్డి టైలర్ యజమాని కుశలసింహారెడ్డి, బీసీ నాయకులు ఎస్ హరికృష్ణ చారి, ఎండీ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.