కేబుల్ బ్రిడ్జిపై యాక్సిడెంట్ – హీరో సాయిధరమ్ తేజ్ కు గాయాలు

  • హెల్మెట్ ధరించడంతో తప్పిన పెను ప్రమాదం

నమస్తే శేరిలింగంపల్లి: స్పోర్ట్స్ బైక్ పై వెళుతున్న హీరో సాయిధరమ్ తేజ్ రాయదుర్గం కేబుల్ వంతెనపై మీదుగా వెళ్తూ కోహినూర్ హోటల్ సమీపంలో స్కిడ్ అవడంతో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్పీడ్ గా వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరగడంతో కొన్ని మీటర్ల దూరం వరకు దూసుకు పోయాడు. దీంతో కుడికన్ను, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇదే‌ క్రమంలో ఫిడ్స్ రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను గమనించిన పలువురు ప్రయాణికులు స్థానిక మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ డ్రైవ్ చేసే సమయంలో హెల్మెట్ ధరించి ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు మెడికవర్ వైద్యులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై కేబుల్ బ్రిడ్జిపై ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రోడ్డు నెంబర్ 45 నుండి గచ్చిబౌలి వైపుకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు హుటాహుటిన మెడికవర్ ఆస్పత్రికి తరలివచ్చారు.

రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన హీరో సాయి ధరమ్ తేజ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here