బంగారు తెలంగాణ దిశ‌గా తెలంగాణ అభివృద్ది సాగుతోంది: చంద్రిక ప్ర‌సాద్‌

మియాపూర్‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వేలాది మంది తెలంగాణ స్వాతంత్య్రోధ్య‌మ నాయ‌కుల త్యాగాలు, కోట్లాది మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌తో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్య‌మంత్రి కెసిఆర్ పాల‌న‌లో అనుకున్న ల‌క్ష్యం వైపుగా అభివృద్ది ప‌థంలో దూసుకుపోతుంద‌ని ఆ పార్టీ మియాపూర్ డివిజ‌న్ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి చంద్రిక ప్ర‌సాద్ అన్నారు. గ‌త ఏడేళ్ల కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2ల‌క్ష‌ల 30వేల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌ను ప్ర‌వేశపెట్ట‌గ‌లిగేంత సంప‌న్న రాష్ట్రంగా ఎదిగింద‌ని తెలిపారు. నిరంత‌రాయ విద్యుత్ స‌ర‌ఫ‌రా, మిష‌న్ కాక‌తీయ ప‌థ‌కాల సౌజ‌న్యంతో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా వ్య‌వ‌సాయ‌రంగం అభివృద్ది చెందుతుంద‌ని తెలిపారు. మిషన్ భగీరథ‌, మిషన్ కాకతీయ, ఒంటరి మహిళ పెన్షన్, వృధ్యాప్య పెన్షన్, విడో పెన్షన్, 24 గంటల నిరంతర విద్యుత్, కె.సి.ఆర్ కిట్, షి టీం, రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ, కంటి వెలుగు, ఆరోగ్య లక్ష్మీ, డబల్ బెడ్ రూమ్ వంటి ఎన్నో పథకాల‌తో ప్ర‌జా సంక్షేమ పాల‌న కెసిఆర్ వ‌ల్లే సాధ్య‌మ‌య్యింద‌ని తెలిపారు. 2014 ఉమ్మడి రాష్ట్రం కంటే నేటి తెలంగాణ బ‌డ్జెట్ అధికంగా ఉంద‌ని, తెలంగాణ వ‌స్తే ఏం లాభమ‌ని విమ‌ర్శించిన వారికి మంత్రి హరీష్ రావు అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ స‌మాధానం ఇస్తుంద‌ని తెలిపారు. ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు విమ‌ర్శ‌లు మానేసి అభివృద్దికి స‌హ‌కరించాల‌ని సూచించారు.

చంద్రిక ప్ర‌సాద్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here