- ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: దీపావళి పర్వదినాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తన నివాసంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకగా జరుపుకున్నారు. పర్యావరణ హితం బాణసంచా కాల్చారు. తదనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, తెరాస నాయకులకు, కార్యకర్తలకు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, ఆత్మీయులకు, మిత్రులకు , శ్రేయభిలాషులకు , అధికారులకు , అనాధికారులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దీపావళి దివ్యకాంతుల వేళా అష్ట లక్ష్ములు మీ గృహములలో నెలవై మీకు సకలశుభాలను , సాహసోపేతమైన విజయాలను , సిరి సంపదలను, సుఖసంతోషాలను, సంవృద్ది , బోగభాగ్యలను ఎల్లవేళలా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరు కుంటున్నానని తెలిపారు.