కేసు ఐన వారానికే మరోసారి వ్యభిచార దందా…ఎట్టకేలకు ఫ్లాట్ సీజ్

నమస్తే శేరిలింగంపల్లి: వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో దాడి చేసి కేసు నమోదు చేసిన వారం రోజులకే నిర్వాహకులు మరోసారి దందా ప్రారంభించారు. దీంతో పోలీసులు వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఫ్లాట్ ను సంవత్సరం పాటు సీజ్ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఫ్లాట్ సీజ్ చేస్తున్న పోలీసు సిబ్బంది

మాదాపూర్ అరుణోదయ కాలనీలోగల ప్రభావతి ప్లాజా ఫ్లాట్ నెంబర్ 198/4/2/76 లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడం తో మార్చి నెల 23వ తేదీన మాదాపూర్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నిర్వాహకులు, విటులను అరెస్ట్ చేసిన పోలీసులు బాధితులను రెస్క్యూ హోమ్ కు తరలించి కేసు నమోదు చేశారు. వారం రోజుల అనంతరం 31వ తేదీన మరోసారి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు నిర్వాహకులు, విటులను అరెస్ట్ చేసి మరో కేసు నమోదు చేశారు.

వ్యభిచార గృహం నిర్వహించిన ప్రభావతి ప్లాజా

కాగా అపార్ట్మెంట్ వాసులు, ఇరుగుపొరుగు వారి విజ్ఞప్తితో మాదాపూర్ పోలీసులు ఉన్నతాధికారులకు సీజ్ చేసేందుకు అనుమతికి అభ్యర్థించారు. దీంతో మంగళవారం పోలీసులు ఫ్లాట్ సీజ్ చేశారు. సంవత్సరం పాటు సదరు ఫ్లాట్ లో ఎటువంటి కార్యకలాపాలు జరగరాదని, ఎవ్వరికీ అద్దెకు సైతం ఇచ్చేందుకు వీలు లేకుండా ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here