
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ అన్నపూర్ణ ఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజు ఘనంగా కొనసాగాయి. ఆలయంలో ప్రతిష్టించిన అమ్మవారి ఉత్సవ మూర్తి అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు శివుడికి అన్నం వడ్డిస్తున్నట్టు అద్భుత అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. అన్నపూర్ణ దేవికి స్థానిక మహిళా భక్తులు కుంకుమార్చన చేశారు. ఆలయ పాలకమండలి సభ్యులతోపాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నారు.






