మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): వారాంతపు సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా మాదాపూర్‌లోని శిల్పారామం యాంఫీ థియేటర్‌లో అభినయ వాణి నృత్య నికేతన్ గురువు బాల త్రిపుర సుందరి శిష్య బృందం చెయ్ కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి ఎంతగానో ఆకట్టుకున్నారు.

గజవదాన, జయము జయము, నటరాజ స్తుతి, ప్రళయ ప్రయోధి, కులుకాక, వసంత స్వరజతి, ఫ్యూషన్ చరిష్ణు అంశాలను శివాని కాజా, ఎ. శ్రీసౌమ్య, సంయుక్త, సహన రెడ్డి, శ్రీవాణి నూతి, శశి చల్ల తాడేపల్లి, ఎస్‌వీకేవీపీ దీక్షితులు, రజని చకిలం, అమూల్య విజయ పినపాటి, ఇషితా దేవులపల్లి లు ప్రదర్శించారు.






