మంత్రి, ఎంపీని కలిసిన జర్నలిస్టు యూనియన్ జిల్లా నూతన కార్యవర్గం

  • సమస్యల పై నాయకుల వినతి, పరిష్కరిస్తామన్న మంత్రి

రంగారెడ్డి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడ‌బ్ల్యూజే) రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిసింది. జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కలిసిన యూనియన్ నాయకులు జర్నలిస్టుల సమస్యలను మంత్రికి విన్నవించారు. ప్రధానంగా జిల్లా పరిధిలో పనిచేస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రికి తెలిపారు. ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. మంత్రి సబితారెడ్డి స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి డబుల్ బెడ్‌రూం ఇళ్ల‌ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ప్రధాన కార్యదర్శి గాధం రమేష్, కోశాధికారి వెంకటేష్, ఉపాధ్యక్షులు బాల్ రెడ్డి, రాజిరెడ్డి, తగరం సత్యనారాయణ, టెంజు జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఉపాధ్యక్షుడు పులి అమృత్ గౌడ్ పాల్గొన్నారు.

మంత్రి సబితారెడ్డిని కలిసిన టీయుడబ్ల్యూజే జిల్లా నూతన కార్యవర్గం నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here