వంగవీటి మోహన రంగా చేసిన సేవలు మరువలేనివి: మిరియాల ప్రీతమ్

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వంగవీటి మోహన రంగా చేసిన సేవలు మరువలేనివని మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల ప్రీతమ్ అన్నారు. వంగవీటి మోహన రంగా 32వ వర్ధంతిని పురస్కరించుకొని చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ కాలనీ శ్రీ షిర్డీ సాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో మిరియాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ప్రీత‌మ్‌ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా కాపుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రతి ఒక్కరు కాపుల అభివృద్ధికి పాటుపడినప్పుడే కాపులు రాజకీయంగా బలపడి సమాజంలో బలమైన శక్తిగా ఎదుగుతారని పేర్కొన్నారు. మిరియాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. పేదలను ఆదుకోవడానికి చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘం నేతలు సుబ్బారావు, త్రినాథ్, విష్ణుమూర్తి, సత్తిబాబు, కృష్ణ, సోమేశ్, శ్రీరామ్, గుణ, వినయ్ పాల్గొన్నారు.

వంగవీటి మోహన రంగా చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించిన మిరియాల ప్రీతమ్
శ్రీ షిర్డీ సాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో అన్న‌దానం నిర్వ‌హిస్తున్న మిరియాల ప్రీతమ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here