చెరువుల సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాలి: ప్రభుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

మియాపూర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చెరువుల వ‌ద్ద అసంపూర్తిగా ఉన్న ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ప్రభుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. సోమ‌వారం మియాపూర్ డివిజన్ పరిధిలోని త‌న క్యాంపు కార్యాలయంలో గాంధీ గంగారాం, పటేల్ చెరువు సుందరీకరణ పనుల పురోగతిపై ఇరిగేషన్, రెవెన్యూ శాఖ, టౌన్ ప్లానింగ్ అధికారులతో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

అధికారుల‌తో క‌లిసి స‌మీక్ష నిర్వ‌హిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ద్వారా రూ.31.26 కోట్ల‌తో పటేల్ కుంట చెరువు, గంగారాం పెద్ద చెరువు సుందరీకరణ పనులు చేపట్టడం జరిగింద‌ని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనుల‌ను వేగవంతం చేయాలని, జాప్యం తగదని అన్నారు. చెరువుల చుట్టూ స్థలాల యజమానులతో చర్చించి ఎటువంటి ఆటంకం లేకుండా పనుల‌ను పూర్తి స్థాయిలో చేపట్టాలని అన్నారు. యజమానులు కూడా సహకరించి చెరువుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ మురళీ కృష్ణ, ఈఈ హైదర్ ఖాన్, డీఈ పవన్ కుమార్, ఏఈ శేషగిరి రావు, తహసీల్దార్ వంశీ మోహన్, ఆర్ఐలు చంద్రారెడ్డి, మహిపాల్, శేరిలింగంపల్లి సిటీ ప్లానర్ శ్రీనివాస్, చందానగర్ ఏసీపీ సంపత్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here