శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బీజేవైఎం రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్ ని బీజేవైఎం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ కుమ్మరి జితేందర్, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు శివ కుమార్, మియపూర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు సిద్దూ, హఫీజ్ పేట్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షుడు నందు పాల్గొన్నారు.






