శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన చారిత్రాత్మక నిరవధిక నిరాహార దీక్షకు 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మియాపూర్‌లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు వడ్డెరాజు రాజు ఆధ్వర్యంలో మియాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఒక కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాలు, తెలంగాణ ప్రజల అలుపెరుగని పోరాటాలు, కేసీఆర్ పట్టుదల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి నాంది పలికిన దీక్షా దివస్‌ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆశ్రయ ఓల్డేజ్ హోమ్‌లోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధనబోయిన పురుషోత్తం యాదవ్, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, మార్రపు గంగాధర్, కొంచ శివరాజ్, సయ్యద్ హనీఫ్, ఏలంకి శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్, రాజు, భిక్షపతి, గంగాధర్, వరలక్ష్మి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఏఆర్పీ టీమ్ సభ్యులు, వివిధ కాలనీల కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





