చందానగర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం.. హాజ‌రై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎనక్లేవ్ కాలనీలో స్థానిక యువ నాయకుడు పొట్లచెరువు ఉదయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్‌లతో కలిసి ఆయన వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. దీపావళి పండుగ మరుసటి రోజు సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సదర్ సమ్మేళనం కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితమైన వేడుక కాదని, ఇది తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, యావత్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. సదర్ ఉత్సవాల్లో అందంగా అలంకరించిన భారీ దున్నరాజుల (దున్నపోతుల) ప్రదర్శన, వాటి విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఇలాంటి వేడుకలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here