తిరువనంతపురంలో ప్రజా పద్దుల కమిటీల చైర్మన్ల సమావేశానికి హాజరైన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో నవంబర్ 3, 4 తేదీల్లో నిర్వహించిన భారత పార్లమెంట్, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల ప్రజా పద్దుల కమిటీల (PAC) చైర్మన్ల సమావేశంలో తెలంగాణ ప్రజా పద్దుల కమిటీ (PAC) చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీష్‌తో పాటు తెలంగాణ ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ శాసన మండలి కార్యదర్శి డాక్టర్ వి. నర్సింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి, అడిషనల్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుధాకర్ తదితరులు హాజరయ్యారు.

దేశంలోని పార్లమెంట్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల ప్రజా పద్దుల కమిటీల చైర్మన్లు ఒకే వేదికపై సమావేశం కావడం విశేషం. ప్రజాధనం వినియోగం, ప్రభుత్వ ఖర్చుల పర్యవేక్షణ, ఆర్థిక జవాబుదారీతనం వంటి అంశాలపై ఇటువంటి సమావేశాలు చర్చలకు, అనుభవాల పరస్పర మార్పిడికి వేదికగా నిలుస్తాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here