చెత్త సేకరించే కార్మికుల పొట్టగొడితే ఊరుకునేది లేదు.. రాజధాని రణభేరిలో ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత వార్నింగ్..

  • మియాపూర్ లో ఉత్సాహంగా రాజధాని రణభేరి
  • వాసిలి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ సదస్సు 
  • రేవంత్ పాలనలో లోపాలను ప్రశ్నించిన టిఆర్ఎస్ అధినేత

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విశ్వ నగరంలో రక్షిత మంచినీరు అందుబాటులో లేదని, కొన్ని ప్రాంతాలలో ఇంకా ప్రజలు మురికి నీరే తాగుతున్నారని. మంచినీరు ఇవ్వలేని ప్రభుత్వం నగరాన్ని మారుస్తామంటే ఎవరు నమ్ముతారు అంటూ టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. మియాపూర్ నరేన్ గార్డెన్ లో రాజధాని రణభేరి పేరుతో భారీ సదస్సు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ అధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో కవిత ప్రసంగించారు. నగరంలో 50వేల మంది చెత్త సేకరించే కార్మికులను పొట్టగొట్టే నిర్ణయం తీసుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని అన్నారు. చరిత్ర తెలియనోళ్లు నగర భవిష్యత్తును నిర్మించలేరని, నిజాం నవాబు హైదరాబాదు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. వారు చేసిన అభివృద్ధి నేటికి కనిపిస్తుందని, అనేక ఐటీ పరిశ్రమలలో వేలాది మంది ఉద్యోగుల ఉన్నారని. వారి ప్రయోజనం కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీలు విస్తరిస్తున్న అందుకోసం ప్రత్యేక పాలసీ తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, గ్లోబల్ సమ్మిట్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. నకిలీ ఒప్పందాలు, ఫేక్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ పెట్టుబడులు వచ్చాయంటు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

రాజధాని రణభేరిలో మాట్లాడుతున్న కల్వకుంట్ల కవిత. పక్కనే గ్రేటర్ అధ్యక్షుడు వాసిలి చంద్రశేఖర ప్రసాద్

ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. ప్రజలను తప్పుదోవ పట్టించే గ్లోబల్ సమ్మిట్లను అడ్డుకుంటామని అన్నారు. ఉద్యోగ, ఉపాది ఇచ్చే సమ్మిట్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వేలాది ఎకరాలు భూములు రేవంత్ రెడ్డి సోదరులు గుంజు కుంటున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదని నకిలీ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. చెత్తను సేకరించే కార్మికులను తొలగించి రాంకీకి అప్పగించడం అన్యాయం. చెత్త సేకరించి ఆటో కార్మికుల అన్యాయం జరిగితే సహించేది లేదు. కార్మికుల అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డి ఇంటి ముందు చెత్త పారబోస్తాం అంటూ హెచ్చరించారు. జిహెచ్ఎంసి పరిధిలో 11 వేల కోట్ల బడ్జెట్ ఉన్న అభివృద్ధి ఎక్కడ జరగడం లేదు. రానున్న ఎన్నికల్లో బల్దియాలో టిఆర్ఎస్ జండా ఎగురవేస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు కుక్కలు మరో వైపు దోమలు బెడద అధికంగా ఉంది. అవినీతి అధికంగా ఉంది. మానవత్వంతో కూడిన అభివృద్ధి హైదరాబాదు నగరంలో జరగడం లేదు.రేవంత్ రెడ్డి పథకాలు పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ పాఠశాల నిర్మించలేదు. ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అందిస్తాం. బియ్యం రేట్లు విపరీతంగా పెరిగాయి నియంత్రించే వ్యవస్థ లేకపోవడం సిగ్గుచేటు అన్నారు

సభలో భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here